శింగనమల మండల కేంద్రంలో మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిన శ్రీ మసూద్ స్వామి ఉరుసు కార్యక్రమంలో భాగంగా సోమవారం శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ప్రభుత్వ విద్యా సలహాదారులు ఆలూరి సాంబశివారెడ్డి, డీసీఏంఏస్ డైరెక్టర్ బొమ్మన శ్రీరామిరెడ్డి, యువ నాయకులు ఆలూరు ఏర్రిస్వామిరెడ్డి ఆధ్వర్యంలో మైనార్టీ నాయకులు వక్ప్ బోర్డు జిల్లా సెక్రటరీ నూర్ మహమ్మద్ ఇంటివద్ద నుండి దర్గా వరకు ఫకీర్ల వాయిద్యాల మధ్య ర్యాళీగా వెళ్ళి దర్గాలోని మసూద్ స్వామి వారికి గలఫ్ మరియు పూలచద్దర్ సమర్పించారు. అనంతరం చక్కెర చదివించి వారు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కోఆప్సన్ సభ్యులు మర్తాడు ఆలీభాష, సర్పంచ్ నాగమునెమ్మ, మహిళా నాయకురాలు బొమ్మన ఓబుళమ్మ, బసిరెడ్డి శకుంతలమ్మ, వైస్ ఏంపీపీ విజయా, మత్స్యకార సంఘం ప్రెసిడెంట్ బెస్త వెంకట నారాయణ, ఉప సర్పంచ్ పత్తి లక్ష్మినారాయణరెడ్డి, వైసిపి నాయకులు భాస్కర్ రెడ్డి, నాగరాజు రాయల్ , జెల్లి శ్రీనివాసుల యాదవ్ , భాస్కర్ యాదవ్ , బాలకృష్ణ, మంత్రిగారి నవీన్ , శివశంకర్ , భాషా, హరి మరియు మసూద్ స్వామి భక్తాదులు, వైకాపా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.