ప్రముఖ పర్యటక కేంద్రమైన అరకులోయ పట్టణ పరిసర ప్రాంతంలో సోమవారం వేకువ జామున పొగ మంచు దట్టంగా కప్పేసింది. పొగ మంచు ఉదయం 9 గంటల వరకు కమ్ముకోవడంతో రహదారులు పూర్తిగా కనిపించకపోవడంతో వాహనదారులు హెడ్లైట్లేసుకొని రాకపోకలు కొనసాగించాల్సిన పరిస్థితి నెలకొంది. ఏదేమైనాప్పటికీ ఎన్నడూ లేని విధంగా ఫిబ్రవరి నెల వచ్చినప్పటికీ కూడా అరకులోయ పట్టణ పరిసర ప్రాంతం పొగమంచు కప్పేయడంతో కాశ్మీర్ లాంటి ప్రాంతాన్ని తలపించింది. సోమవారం ఉదయం ఒక్కసారిగా పైనుంచి మంచు కురుస్తుందా అన్న రీతిలో ఆయా గ్రామాల్లో ఉన్న గృహాలు కూడా కనిపించకుండా పొగ మంచు కమ్మేసింది.