తన కుమారుడికి జుట్టు సరిగ్గా కట్ చేయలేదన్న కోపంతో కానిస్టేబుల్ సెలూన్‌కు తాళం వేసిన ఘటన తమిళనాడులోని తిరునెల్వేలిలో జరిగింది. అయితే ఆ బాలుడు కటింగ్ వేరే షాప్‌లో చేయించుకొని, తన తండ్రికి పొరపాటుగా ఈ షాప్‌ను చూపించాడు. దుకాణదారుడు చెబుతున్నా వినకుండా కానిస్టేబుల్ షాపుకు తాళం వేశాడు. ఈ వీడియో వైరల్‌గా మారడంతో అధికారులు కానిస్టేబుల్‌ను ఆర్మ్డ్ రిజర్వ్‌కు బదిలీ చేశారు.