సమాజ హితమే తన అభిమతంగా అనేక సేవా కార్యక్రమాలు చేసి అందరితో సేవా శూరుడు అని ఎస్ ఎస్ ఎస్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత సూర శ్రీనివాసరావు అనిపించుకున్నారు. ఆయన చేసిన సేవలకుగానూ విశాఖపట్నం సెయింట్ పాల్స్ థియోలాజికల్ కళాశాల డైరక్టర్ రెవ డాక్టర్ కెవిఎన్ పాల్ గౌరవ డాక్టరేట్‌ను ప్రధానం చేశారు. సోమవారం సెయింట్ పాల్స్ థియోలాజికల్ కళాశాల కళాశాల స్నాతకోత్సవ కార్యక్రమంలో ప్రముఖ సామాజిక వేత్త సూర శ్రీనివాసరావుకు డాక్టరేట్ ప్రధానం చేసి సత్కరించారు. ఈ సందర్భంగా డైరక్టర్ రెవ డాక్టర్ కెవిఎన్ పాల్ మాట్లాడుతూ కోవిడ్ సమయంలో మానవాళికి చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును ప్రదానం చేసినట్లు వారు తెలిపారు. కోవిడ్ మహమ్మారి కబళిలిస్తున్న వేళ ఆకలితో అలమటిస్తున్న అన్నార్తులకు, నిరాశ్రయులకు, అనాధలకు, నిరుద్యోగులకు అన్నీ తానై అండగా నిలిచి సూర శ్రీనివాసరావు ఆహారపొట్లాలను, నిత్యావసర సరుకులను అందజేశారని తెలిపారు. అదే విధంగా పాఠశాలల అభివౄద్ధికి, శ్మశానాల ఏర్పాటుకు, నిరుపేద విద్యార్థులను, క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వారికి నగదు బహుమతులతో పాటు క్రీడాపోటీల నిర్వహణకు తనవంతు సహకారం అందజేశారని తెలిపారు. తన సాయం అవసరం ఉందని తెలిసిన వెంటనే లేదన కుండా సాయం చేసి అందరికీ సేవకుడయ్యాడని కొనియాడారు.
గౌరవ డాక్టరేట్ గ్రహీత సూర శ్రీనివాసరావు మాట్లాడుతూ పేదలకు సేవ చేయడంలోనే తనకు నిజమైన సంతౄప్తి ఉంటుందన్నారు. తాను ఏనాడూ అవార్డుల కోసం ప్రశంసల కోసం ఆలోచించలేదన్నారు. కోవిడ్ వేళ అవసరమైన మేరకు లక్షలాదిగా ఆహారపొట్లాలు, వేలాదిగా నిత్యావసర కిట్లు అందజేసి వారిని మానవత్వంతో ఆదుకున్నానన్నారు. తనను గౌరవ డాక్టరేట్‌తో అందించిన సెయింట్ పాల్స్ థియోలాజికల్ కళాశాలకు రుణపడి ఉంటానని తెలిపారు. ఈ డాక్టరేట్‌తో తనపై మరింత బాధ్యత పెరిగిందని, భవిష్యత్ ఎంతో మందికి సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్ననని చెప్పారు.