కీళ్ల నొప్పుల సమస్యను ఇంట్లో లభించే పదార్థాలతోనే ఉపశమనం పొందవచ్చు. దీనికి కావాల్సిందల్లా ఒక్కటే. పాలు, గసగసాలు, ఫూల్ మఖనీతో మిశ్రమాన్ని తయారు చేయడం. ఆ మిశ్రమాన్ని వారానికి 2-3 సార్లు తాగడం వల్ల శరీరానికి తగినంత క్యాల్షియం లభిస్తుంది. ఎముకలు దృఢంగా తయారవుతాయి. ఒక గ్లాస్ పాలు, ఒక టీ స్పూన్ గసగసాలు, ఒక కప్పు ఫూల్ మఖనీ ఒక గిన్నెలో వేసి కలపాలి. ఈ పాలను ముప్పావు గ్లాస్ అయ్యే వరకు మరిగించుకోవాలి.