మధ్యప్రదేశ్‌లో మాజీ ముఖ్యమంత్రి ఉమా భారతి చేస్తున్న పోరాటం ఫలించింది. ఎక్కడబడితే అక్కడ ఏర్పాటు చేస్తున్న బార్ల వల్ల రాష్ట్రంలో నేరాలు పెరిగిపోయాయని, మహిళలకు భద్రత లేకుండా పోతోందని, రాష్ట్రంలో నియంత్రిత మద్యం విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని ఉమా భారతి కొద్ది రోజుల నుంచి మద్యం షాపుల ఎదురుగా ఆందోళన నిర్వహిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా శివరాజ్ సింగ్ చౌహన్ ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ పాలసీని తీసుకొచ్చింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని బార్లను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది.