నార్పల మండలం గూగూడులో వెలసిన శ్రీగూగూడు కుళ్ళాయస్వామికి మరియు శ్రీఅంజనేయస్వామికి మంగళవారం ధర్మవరం నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయ ప్రకారం పరిటాల శ్రీరామ్ కు గ్రామస్థులు ఘనంగా స్వాగతం పలికారు. ఈసందర్బంగా పరిటాల శ్రీరామ్ ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసారు. శ్రీకుళ్ళాయిస్వామి చావిడిలో ప్రత్యేక ప్రార్థనలు చేసారు. ఈకార్యక్రమంలో టిడిపి రాష్ర్ట ప్రధాన కార్యదర్శి, ద్విసభ్యకమిటి సభ్యులు అలం నరసానాయుడు, గ్రామస్థులు ఆలయ కమిటీ మాజీ చైర్మన్ రాజన్న, జాఫర్ వలి, నాగలింగ, రాజన్న, ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.