టిడిపి తరఫున ఎమ్మెల్సీ ఎన్నికల్లో పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల అభ్యర్థిగా భూం రెడ్డి రాంగోపాల్ రెడ్డి పోటీ చేస్తూ ఈనెల 22వ తేది బుధవారం అనంతపురం జిల్లా కేంద్రంలో నామినేషన్ వేస్తున్న సందర్భంగా ఆయనకు మద్దతు తెలుపుతూ నామినేషన్ కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో పాల్గొనాలని టిడిపి ఇన్చార్జ్ ఉమామహేశ్వర నాయుడు పిలుపునిచ్చారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి పట్టభద్రులు, మన పార్టీ సానుభూతిపరులు పెద్ద ఎత్తున హాజరు కావాలని ఆయన కోరారు.