రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి పాలనలో ప్రజాస్వామ్యం వెంటిలేటర్ పై ఉందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి సవితమ్మ పేర్కొన్నారు. మంగళవారం పెనుకొండ పట్టణంలోని సవితమ్మ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ గన్నవరం టిడిపి ఆఫీస్ పై వైసీపీ రౌడీ మూకల దాడి దుర్మార్గం అన్నారు. శాసన మండలి వ్యవస్థ నే రద్దు చేయాలనుకున్న వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి మరి ఏ విదంగా ఎమ్మెల్సీ అభ్యర్థులును ప్రకటిస్తాడని తెలిపారు.
నిన్నటి రోజున గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై వైసీపీ మూకల దాడి దుర్మార్గమని బీసీ నేతలే లక్ష్యంగా జగన్ దాడులు చేస్తున్నారన్నారు. ఒక వైపు బీసీ లకు పదవులు ఇచ్చామని చెప్పుకుంటూ మరోవైపు బీసీ నాయకులపై దాడులకు తెగబడుతున్నారన్నారు. ప్రతిపక్ష పార్టీలపై వైసీపీ దాడులు బెదిరింపు దిగుతోందని తెలిపారు. గన్నవరంలో విధ్వంసానికి పాల్పడిన వైసీపీ శ్రేణులను వదిలేసి టిడిపి వారిని పోలీసుల చేయడం దుర్మార్గం అని తెలిపారు.
తప్పుడు అధికారుల వల్లే పోలీసుల విలువ దిగజారిపోతోందని, వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రౌడీ మూకలు చెలరేగిపోతున్నారన్నారు. దాడులు చేసిన వారిని వదిలి నిరసన తెలిపిన టిడిపి నేతలను అరెస్టు చేయడం ఏంటిని ప్రశ్నించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పోలీసులు చేతుల నుండి వైసీపీ చేతులలోకి వెళ్ళిందన్నారు. కార్యాలయం పై కర్రలతోనూ రాళ్లతో దాడి చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం ఏంటిని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి ఓటమి భయంతోనో ఇలాంటి దుచ్చెర్లకు పాల్పడుతున్నారని గన్నవరం టిడిపి కార్యాలయం పై దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు మాధవ నాయుడు, మాజీ మండల కన్వీనర్ శ్రీరాములు గుట్టురు మాజీ సర్పంచ్ సూర్యనారాయణ, మాజీ వైస్ సర్పంచ్ సుబ్రహ్మణ్యం త్రివేంద్ర నాయుడు అరుణ్ కుమార్ రెడ్డి , బాబుల్ రెడ్డి వాసుదేవరెడ్డి, దాదు చేరుకురు అనిల్ తదితరులు పాల్గొన్నారు.