జార్టీ-మల్గుర స్టేషన్ల మధ్య ఓవర్ హెడ్ ఎక్విప్మెంట్ (ఓ హెచ్ ఈ ) లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా, రైళ్లు రద్దు చేసినట్లు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎ కె త్రిపాఠి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైలు నెం. 08552 కిరండూల్-విశాఖపట్నం ప్యాసింజర్ స్పెషల్ 21న రద్దు చేసామన్నారు. అదే విధంగా రైలు నంబర్ 08551 విశాఖపట్నం-కిరండూల్ ప్యాసింజర్ స్పెషల్ 21న రద్దు చేయబడిందని అందువల్ల విశాఖపట్నం-కిరండూల్-విశాఖపట్నం మధ్య ఈ రైలు సేవలు ఉండవన్నారు. జరిగిన అసౌకర్యానికి ప్రగాఢ విచారం వ్యక్తం చేశారు. ప్రజలు మార్పులను గమనించి తదనుగుణంగా వ్యవహరించాలని అభ్యర్థించారు.