ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వ దవాఖానాలో దారుణం, అసలేం జరిగిందంటే?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 21, 2023, 01:39 PM

ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం ఫలితంగా చీరాల మండలం కావూరివారిపాలెంకు చెందిన ఓ వివాహిత ఆసుపత్రిలోనే 15 రోజులుగా మగ్గుతోంది. తాము చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వ వైద్యులు ఆమెకు గుట్టుగా చికిత్స చేస్తున్నప్పటికీ సోమవారం విషయం బహిర్గతం అయింది. ఆపరేషన్ చేయించుకున్న శ్రావణి నీరసంగా ఉన్నందున ఆసుపత్రిలో ఉంచినట్లుగా బంధువులకు వైద్యులు చెబుతూ వచ్చారు. అయితే వారికి అనుమానం వచ్చి గట్టిగా వైద్యులను నిలదీయడంతో అసలు విషయం వెలుగు చూసింది. దీనిపై వారు ఆందోళన చేపట్టగా బాపట్ల ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ సిద్ధార్థ నచ్చ చెప్పారు. అదేమీ పెద్ద సమస్య కాదని, ప్రాణాలకు ప్రమాదం లేదని అన్నీసరిదిద్ది ఆమెను ఇంటికి పంపుతామని వారిని బుజ్జగించారు. అయితే విషయం కావూరివారి పాలెం గ్రామానికే చెందిన హ్యూమన్ రైట్స్ ప్రొటెక్టర్స్ కౌన్సిల్ రాష్ట్ర నాయకుడు ప్రదీప్ దృష్టికి రావడంతో మీడియాకు జరిగిందంతా చెప్పారు. బాధితురాలి పక్షాన నిలబడి పోరాటం సాగిస్తామని కూడా ప్రదీప్ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com