ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో సోమవారం రైల్వే పోలీసులు ప్రజలకు రైళ్లపై రాళ్ల దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ప్రజలను హెచ్చరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. రైళ్లపై రాళ్లదాడులకు పాల్పడితే చట్టంలో వారికి ఎటువంటి శిక్షలు పడతాయో వారికి వివరించారు. ఇటీవల కాలంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లపై ఆకతాయిలు రాళ్ల దాడులకు పాల్పడుతున్నారని అటువంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నామని అన్నారు. రైళ్లల్లో ప్రయాణించే వారు సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరుకునే విధంగా వ్యవహరిస్తున్నామని అన్నారు.