ప్రకాశం జిల్లా గిద్దలూరు వైసీపీ నాయకులు మంగళవారం మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిస్థితులను ఆయనకు వివరించారు. గిద్దలూరు వైసీపీ నాయకులలో బేస్తవారిపేట ఎంపీపీ ఓ సూరారెడ్డి, కామూరి రమణారెడ్డి, అక్కి పుల్లారెడ్డి, రాంనారాయణ రెడ్డి తదితరులు ఉన్నారు. అయితే మాజీ మంత్రితో వైసిపి నాయకులు ఏం మాట్లాడారో అని నియోజకవర్గం లో చర్చ మొదలైంది. గత కొద్ది రోజులుగా స్థానిక ఎమ్మెల్యేకు నాయకులకు సానిహిత్యం లోపించిందని పుకార్లు వినిపిస్తున్నాయి.