అక్రమంగా నాటు సారా తయారు చేస్తున్న స్థావరాలపై మెరుపు దాడులు నిర్వహించి 400 లీటర్ల నాటుసారా ఊటను ధ్వంసం చేసినట్లు పాలసముద్రం ఎస్సై సురేష్ మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం పాలసముద్రం మండలంలోని నరసింహపురం అటవీ ప్రాంతంలో , తమకు వచ్చిన రహస్య సమాచారం మేరకు నాటు స్థావరాలపై నిర్వహించిన మెరుపు దాడుల్లో 400 లీటర్ల నాటు సారా ఊటను ధ్వంసం చేసామన్నారు.
జిల్లా ఎస్పీ రీశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు, మండల పరిధిలో పరిసరాల గ్రామాల్లో నాటు సారా తయారీ విక్రయాలపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. మెరుపు దాడులు కొనసాగిస్తామన్నారు. ప్రజలు ఎవరైనా ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చట్టపరమైన తీసుకుంటామన్నారు, ఎవరైనా నాటు సారా తయారు చేస్తున్నట్లు అనుమానితులు ఉంటే ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు, సమాచారము అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు