విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ వీసీ ప్రసాద్రెడ్డిపై విచారణకు ఎన్నికల కమిషన్ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ వైసిపి అభ్యర్థికి మద్దతుగా సమావేశం నిర్వహించారని ఈసీకి టీడీపీ నేతలు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ స్పందించింది. తక్షణం విచారణ చేయాల్సిందిగా కలెక్టర్, ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్న మల్లికార్జునకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. విచారణ బాధ్యతను ఆర్డీఓ హుసేన్ సాహెబ్ కు కలెక్టర్ అప్పగించారు.