ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చైనాను హెచ్చరించారు. ఒకవేళ ఉక్రెయిన్ కు వ్యతిరేకంగా చైనా రష్యాకు మద్దతు ప్రకటిస్తే ఇది ప్రపంచ యుద్ధాన్ని తెచ్చేందుకు కారణమవుతుందన్నారు. చైనా తమ పక్షాన ఉండాలని తాను కోరుకుంటున్నట్లు జెలెన్స్కీ చెప్పారు. అయితే అది సాధ్యం కాకపోవచ్చన్నారు. ఉక్రెయిన్ లో ఏం జరుగుతోందన్నదానిపై చైనా ఆచరణాత్మక విశ్లేషణ చేసుకోవాలన్నారు. చైనా రష్యాతో జట్టుకడితే ప్రపంచ యుద్ధం జరిగే పరిస్థితి వస్తుందన్నారు.