గత టీడీపీ ప్రభుత్వంలో ముస్లింలకు ప్రవేశపెట్టిన పథకాలను రద్దు చేసి ముస్లింల ద్రోహిగా సీఎం జగన్మోహన్ రెడ్డి నిలిచారని టీడీపీ ముస్లిం మైనార్టీ నేతలు ఆరోపించారు. నెల్లూరు జిల్లా, కావలి టీడీపీ కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో మైనార్టీ నేతలు మాట్లాడుతూ..... మైనార్టీల కోసం ప్రవేశపెట్టిన దుల్హన్ పథకం, రంజాన్‌తోఫా, విదేశీ విద్య వంటి పథకాలను రద్దు చేసి నేడు అన్సర్ అనే వ్యక్తి ముస్లింలకు రూ.20 కోట్లు జగన్ మంజూరు చేశాడని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇదే వాస్తవమైతే మైనార్టీలకు ఏమేమి పనులు చేశారో చెప్పాలన్నారు. జగన్ ప్రభుత్వంలో ముస్లింల సంక్షేమం ఎండమావిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో టీడీపీ మైనార్టీ నేతలు షేక్ మస్తాన్, షేక్ ఖాదర్‌బాషా, సయ్యద్ అబ్దుల్ రహీం, రఫీ, సందాని, హఫీజ్, అహ్మద్, మన్సూర్, అమీర్‌ఖాన్, సయ్యద్ బాష తదితరులు పాల్గొన్నారు.