ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 21, 2023, 02:34 PM

 అమరావతి రాష్ట్ర రాజధాని అని దేశానికి ప్రపంచానికి తెలియాలంటే చంద్రబాబునాయుడు మళ్లీ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని టీ.సల్లూరు గ్రామంలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వహించారు. నాలుగు సంవత్సరాలలో జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రాన్ని అదోగతి పాలుజేశాడని విమర్శించారు. రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్టలేదన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడం చేతగాక ప్రశ్నిం చిన వారికి ఇబ్బందులకు గురి చేస్తున్నార న్నారు. నిత్యవసరాల విషయంలో మధ్య తరగతి ప్రజల నడ్డి విరిచా డన్నారు. ఉద్యోగ, ఉపాధ్యా యులపై కక్ష సాధింపు దోరణితో వ్యవహరిస్తున్నార న్నారు. కార్యక్రమంలో టీడీ పీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com