గన్నవరం టీడీపీ కార్యాలయంపై వైసీపీ గూండాలు దాడి చేయడం అమానుషమని ఒంగోలు పార్ల మెంటు టీఎన్‌టీయూసీ ప్రధాన కార్యదర్శి ఈదర మల్లయ్య ఆరోపించారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరులసమావేశంలో మల్లయ్య మాట్లాడారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే వైసీపీ నాయకులు దాడులకు తెగబడుతున్నారన్నారు. దుండగులు కార్యాలయంపై దాడి చేయడమే గాక పర్నీచర్లు, కంప్యూటర్లు, వాహనాలను ధ్వంసం చేశారన్నారు. పోలీ సులకు సమాచారమిచ్చినా పట్టించుకోక పోవడం దారుణమన్నారు. ఈ సైకో పాలన ఎంతో కాలం కొనసాగదన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని తగిన బుద్ది చెబుతార న్నారు. దాడులకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.