ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్కడ భారీ వేతనం ఇస్తామన్న..స్పందన మాత్రం కరువు

international |  Suryaa Desk  | Published : Wed, Feb 22, 2023, 12:31 AM

మంచి వేతనం, ఉద్యోగ భద్రత ఇది ఎవరైనా కోరుకొంటారు. కానీ స్కాట్ ల్యాండ్ లో ఇవి రెండూ ఉన్నా ఉద్యోగాల వేట చేసే వారు సైతం అక్కడ పనిచేసేందుకు ఆసక్తిచూపడందటా. ఉద్యోగాల్లో చాలా రకాలు ఉంటాయి. కొన్నేమో తక్కువ గంటలు చేస్తే ఎక్కువ జీతం వచ్చేవి ఉంటాయి. మరికొన్ని ఎక్కువ గంటలు చేసినా తక్కువ జీతమే వచ్చేవి ఉంటాయి. ఇంకొన్ని ఉంటాయి.. ఎంత ఎక్కువ పని చేస్తే అంత ఎక్కువ జీతం అందుతుంటుంది. ఇలాంటి వాటి కోసం కొందరు ఇతర దేశాలకు కూడా వలస వెళ్తుంటారు. ఉద్యోగం కోసం దేశాలు దాటుతుంటారు. అయితే అలాంటి ఆఫరే ఇప్పుడు ఒక కంపెనీ ఇచ్చింది. ఇందులో నెలకు రూ. 4 లక్షల జీతం ఆఫర్ చేస్తోంది. అది స్కాట్ ల్యాండ్లో. ఇంత జీతం ఉన్నప్పుడు దేశం గురించి ఆలోచించకుండా వెళ్లే వారు చాలా మందే ఉంటారు. కానీ.. ఇక్కడ మాత్రం దీని కోసం ఎవరూ ఆసక్తి చూపించట్లేదు. పెద్దగా అప్లికేషన్లు రావట్లేదట.


ఇక్కడ చేయాల్సిన పని ఆఫ్‌షోర్ రిగ్గర రోల్. స్కాట్లాండ్ అబెర్డీన్‌లోని నార్త్ సముద్ర తీరంలో పని చేయాల్సి ఉంటుంది. అక్కడ రిగ్లో ఉండి పని చేయాలి. మొత్తం 5 ఖాళీలు ఉన్నాయి. ఆఫ్‌షోర్ రిగ్గర్.. సముద్రంలోని నిర్దిష్ట ప్రాంతంలో రిగ్ ఏర్పాటు చేస్తారు. అక్కడ సముద్రగర్భం నుంచి ఖనిజ నిల్వలను అన్వేషించడం, వెలికితీయడం, ఆయిల్ వెలికితీయడం వంటివి చేయాల్సి ఉంటుంది. దీని కోసం కాస్త శారీరక శ్రమ ఎక్కువ అవసరం. క్లిష్టమైన పరిస్థితులను అధిగమించి పనిచేయాలి. దీని కోసం ప్రత్యేక నైపుణ్యం ఉండాలి.


ఒక్కసారి చమురు రిగ్‌లోకి వెళ్లిన తర్వాత.. 6 నెలల పాటు ఉండాలి. అయితే.. వేతనాలు, ప్రోత్సాహకాలు మాత్రం భారీగా ఉంటాయని గుర్తుంచుకోవాలి. సెలవులు కూడా ఉంటాయి. ఆ రోజున రూ.3877 చెల్లిస్తారు. కంపెనీ పాలసీ ప్రకారం.. వారం సిక్ లీవ్స్ కూడా ఉంటాయి. ఎంపికైన ఉద్యోగికి రోజుకు 12 గంటల చొప్పున పని చేస్తే రోజుకు రూ.36 వేలు అందుతాయి. ఇక ఆ ఉద్యోగి రెండేళ్ల పాటు అక్కడ పనిచేస్తే.. 6 నెలల చొప్పున 2 షిఫ్ట్స్ పూర్తి చేస్తే అతడి వేతనం 95,420 యూరోలకు చేరుతుంది. ఇది భారత కరెన్సీలో రూ. కోటి కావడం షాక్ కలిగించే విషయం.


అయితే ఈ వేకెన్సీ గురించి చెప్పిన కంపెనీ తన పేరు మాత్రం బయటికి వెల్లడించలేదు. కానీ ఎనర్జీ మార్కెట్‌లో చాలా పెద్ద కంపెనీ, పేరున్న కంపెనీ అని పేర్కొంది. ఇక ఈ రోల్ కోసం ఎలాంటి రిక్వైర్‌మెంట్స్ కావాలో కూడా వివరించింది. సదరు వ్యక్తి టెక్నికల్ అండ్ సేఫ్టీ ట్రైనింగ్ తీసుకొని ఉండాలి. బేసిక్ ఆఫ్‌షోర్ సేఫ్టీ ఇండక్షన్ అండ్ ఎమర్జెన్సీ ట్రెనింగ్, ఫ‌ర్‌దర్ ఆఫ్‌షోర్ ఎమర్జెన్సీ ట్రెనింగ్, కంప్రెస్డ్ ఎయిర్ ఎమర్జెన్సీ బ్రీతింగ్ సిస్టమ్, మెడికల్ ట్రైనింగ్ వంటివి శిక్షణ పొంది ఉండాలి. ఈ జాబ్‌కు సంబంధించి ప్రకటన 24 రోజుల కిందట వచ్చింది. అయితే ఆ రిక్వైర్‌మెంట్స్ చూసి పెద్దగా ఆసక్తి చూపించేవారు లేరు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com