ఏపీ ప్రభుత్వం నేడు 'వైఎస్సార్ లా నేస్తం' నిధులను విడుదల చేయనుంది. మొత్తం 2,011 మంది జూనియర్ న్యాయవాదులకు రూ.5 వేలు చొప్పున రూ.కోటి మొత్తాన్ని విడుదల చేయనున్నారు. సీఎం జగన్ బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు. తాజా నిధులతో కలిపి మూడున్నరేళ్లలో 4,248 మంది యువ న్యాయవాదులకు రూ.35.40 కోట్లు ఆర్థికసాయం చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.