దీర్ఘకాల కొవిడ్ రోగుల్లో 59% మందికి వైరస్ లక్షణాలు బయటపడ్డ ఏడాది తర్వాత ఏదో ఒక అవయవ సమస్య తలెత్తుతోంది. కొవిడ్ బారిన పడ్డ తొలిరోజుల్లో పెద్దగా ఇబ్బందులుపడని వారిలో కూడా ఈ సమస్య కనిపిస్తోందని లండన్ పరిశోధనలో వెల్లడించింది. దీర్ఘకాల కొవిడ్ తీరు వైద్య పరిశోధకులకు సవాలు విసురుతోంది. దీన్ని నిర్వచిద్దామంటే లక్షణాలు, రక్త పరీక్షలు, MRIల ద్వారా కూడా కొవిడ్‌లోని ఉపరకాల ఆనుపానులు పట్టుకోలేకపోతున్నారు.