ప్రకాశం జిల్లా కొమరోలు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం లో అభివృద్ధి పనులను బుధవారం ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు ప్రారంభించారు. ఆలయంలో కళ్యాణ మండపం నిర్మాణానికి నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని భూమి పూజ చేసి నిర్మాణ పనులను ప్రారంభించారు. కార్యక్రమానికి హాజరైనందుకు వచ్చిన ఎమ్మెల్యేకు స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ తదితరులు పాల్గొన్నారు.