కుశాలపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు, మండల పార్టీ ఉపాధ్యక్షులు పైడి అన్నంనాయుడు ఇటీవలె శస్త్రచికిత్స చేయించుకుని కోలుకుంటున్నారు. మంగళవారం పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి వావిలపల్లి రామక్రిష్ణ, విజయనగర పార్లమెంటరి అధికార ప్రతినిధి పైడి ముఖలింగం, విజయనగర పార్లమెంటరి అధికార ప్రతినిధి గంటా సంధ్యా గజపతిరావు, విజయనగర పార్లమెంటరి తెలుగుయువత ఉపాధ్యక్షులు గూరు జగదీష్, మండల తెలుగుయువత అధ్యక్షలు బోర శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ మెండ రాజారావు, చిలక అప్పలనాయుడు, లచ్చుబోతు అప్పలరాజు, గుంటుకు సంతోష్ కుమార్, కుశాలపురం పంచాయతీ పెద్దలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.