పెందుర్తి నియోజకవర్గ పరిధి పరవాడ గొర్లివానిపాలెం పంచాయతీ పరిధిలో వున్న ఒక టౌన్షిప్లోని ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు చొరబడి మూడు తులాల బంగారు ఆభరణాలను అపహరించుకుపోయారు. సీఐ పెదిరెడ్ల ఈశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం. ఆర్టీసీలో పనిచేసిన కేఎస్ఎన్ రాజు కుటుంబంతో కలిసి పోర్టెకో టౌన్షిప్లో నివాముంటున్నారు. అదే కాలనీలో వుంటున్న కుమార్తె ఇంటికి ఈనెల 16న భార్యాభర్తలు వెళ్లారు. తిరిగి సోమవారం సాయంత్రం తమ నివాసానికి వచ్చారు. లోపల బీరువా తెరిచి వుంది. దుస్తులన్నీ చిందర వందరగా పడి ఉన్నాయి. బీరువాలో వుంచిన మూడు తులాల బంగారు ఆభరణాలు చోరికి గురైనట్టు నిర్ధారించారు. బాత్రూమ్ వెనుక ఉన్న కిటికీ తొలగించి దొంగలు లోపలికి ప్రవేశించి చోరికి పాల్పడినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ ఈశ్వరరావు తెలిపారు.