పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రారెడ్డి, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి సానిపల్లి మంగమ్మ బుధవారం నామినేషన్లు దాఖలు చేసారు. ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అనంతపురం జిల్లా ఇంచార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి, ఉమ్మడి జిల్లా వైస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నామినేషన్ల అనంతరం విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ వెన్నపూస రవీంద్రారెడ్డి, రామచంద్రారెడ్డి, సానిపల్లి మంగమ్మలను ఎమ్మెల్సీలుగా గెలిపించి, జగనన్నకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.