అనంతపురం జిల్లా నుంచి బీసీ మహిళకు పెద్దపీట వేస్తూ వై. యస్. ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ధానిక సంస్ధల ఎమ్మెల్సీగా సానిపల్లి మంగమ్మకి అవకాశం కల్పించినందుకు బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ముఖ్య మంత్రి వై. యస్. జగన్మోహన్ రెడ్డిని సానిపల్లి మంగమ్మ మర్యాదపూర్వకంగా కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆమెతో పాటు రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి కే. వి. ఉషాశ్రీచరణ్, మాజీ మంత్రి పెనుకొండ ఎమ్మెల్యే మాలగుండ్ల శంకరనారాయణ, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ తదితరులు పాల్గొన్నారు.