ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఆకివీడు పరిధిలో మూడో తరగతి చదువుతున్న ఓ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడిన ఇద్దరు యువకులను స్థానికులు దేహశుద్ధి చేశారు. వివరాల్లోకి వెళ్ళితే.... ఈ బాలిక స్కూల్ నుంచి, తన ఇంటి సమీపంలోని షాపునకు వచ్చి పెరుగు ప్యాకెట్ తీసుకుని వస్తుండగా షేక్ మస్తాన్, షేక్ ఖాన్ బాలికను అడ్డగించి రూ.500 ఇస్తానని చెప్పి మోటారు సైకిల్‌పై ఎక్కించుకొని ఏఎంసీ కార్యాలయ ప్రాంగణంలోని ఆర్బీకే కేంద్రం దగ్గరకు తీసుకెళ్ళి అత్యాచారయత్నం చేయడానికి ప్రయత్నించారు. దీనితో ఆ బాలిక కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి మస్తాన్, ఖాన్‌లను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బాలిక తల్లి ఫిర్యాదు మేర ఏ ఎస్ఐ డి.సంజీవరావు కేసు నమోదు చేశారు. ఆకివీడు ఎస్ఐ అమరావతి వెళ్లడంతో కాళ్ల ఎస్ఐ ఏజీ ఎస్ మూర్తి ఘటన స్థలాన్ని పరిశీలించారు. రాత్రి జిల్లా ఎస్పీ రవిప్రకాష్ ఆకివీడు వచ్చి ఘటనపై ఆరా తీశారు. పోలీసులకు పలు సూచనలు చేశారు. డీఎస్పీ శ్రీనాధ్ విచారణ చేపట్టారు.