విశాఖపట్నం నుంచి బెంగళూరుకు అక్రమంగా తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్టు చేసినట్లు పలమనేరు డీఎస్పీ సుధాకర్‌రెడ్డి తెలిపారు. మరో ఇద్దరు పరారయ్యారన్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ రూ.10 లక్షలు ఉంటుందన్నారు. బంగారుపాళ్యంలో మంగళవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘మహాసముద్రం టోల్‌ప్లాజా వద్ద సీఐ నరసింహారెడ్డి, ఎస్‌ఐ మల్లికార్జున్‌రెడ్డి, తహసీల్దార్ బెన్నురాజ్, పోలీసు సిబ్బంది వాహనాలను తనిఖీ చేశారు. చిత్తూరు వైపు నుంచి వస్తున్న కారులో 96 కిలోల గంజాయి ప్యాకెట్లను గుర్తించారు. తమిళనాడు రాష్ట్రం హోసూరుకు చెందిన శంబు, విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఈ గంజాయిని కొని బెంగళూరుకు తరలిస్తున్నాడు. ఈ క్రమంలో గంజాయి పట్టుబడింది. శంబు, కోయంబత్తూరుకు చెందిన కారు డ్రైవర్ రమేశ్ పరారయ్యారు. కారులో ఉన్న కోయంబత్తూరు జిల్లా వసంతరామ్ గార్డెన్‌కు చెందిన ఎం.ఎన్. అబ్దుల్ జలీల్, కేరళ రాష్ట్రం కాలికట్ జిల్లా నెల్లికొట్టుపరంబిల్ హౌస్‌కు చెందిన ఎన్‌పీ మురళీధరన్, కేతిల్ హౌస్‌కు చెందిన కె.అభిలాష్ పట్టుబడ్డారు’ అని డీఎస్పీ వివరించారు. గంజాయితో పాటు కారును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.