టీడీపీ కార్యాలయాన్నే ధ్వంసం చేయించిన గన్న వరం ఎమ్మెల్యే వంశీకి తగిన బుద్ధి చెబు తామని మదనపల్లె టీడీపీ ఇనచార్జి, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేశ పేర్కొన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయం లో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.... రాష్ట్రంలో వైసీపీ నాయకుల ఆరాచకం పెరిగిపోయిందన్నారు. గన్నవరంలో టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేయడంతో పాటు, కారును కాల్చి వేశారన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలపై దాడులు ఎక్కువయ్యా యన్నారు. రాష్ట్రంలో ఎక్కడ వైసీపీ దౌర్జన్యాలు చేసినా అక్కడ టీడీపీ నాయకులు వెళ్లి అడ్డుకుంటామన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ఆర్‌జే వెంకటేశ, దేవరింటి శ్రీనివాసులు, మోడెం సిద్దప్ప, తులసీధర్‌నాయుడు, నీలకంఠ, మధుబాబు, రఫి, తాజ్ బాషా, రెడ్డిశేఖర్, చల్లా నరసిం హులు, వెంకటరమణారెడ్డి, సుధాకర్, పాల్గొన్నారు.