విశాఖ ఉక్కు కర్మాగారంలో మంగళవారం సాయంత్రం ద్రవపు ఉక్కు నేలపాలైంది. కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం...... ప్లాంటులోని బ్లాస్ట్ ఫర్నేస్ విభాగం నుంచి స్టీల్ మెల్ట్ షాపు (ఎస్‌ఎంఎస్) విభాగానికి ద్రవపు ఉక్కును టీఎల్‌సీ (ట్రాక్ లిక్విడ్ కార్)లో తరలిస్తున్నారు. ఈ క్రమంలో విభాగం బ్రిడ్జి వద్దకు వచ్చేసరికి టీఎల్‌సీకి రంధ్రం పడి ద్రవపు ఉక్కు బయటకు పోయింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ద్రవపు ఉక్కు ఎంతమేర నేలపాలైందనేది తెలియరాలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa