నూజివీడు ఎమ్మెల్యే మేక వెంకట ప్రతాప్ అప్పారావు ఆధ్వర్యంలో నూజివీడు ద్వారక ఎస్టేట్లో బుధవారం మా నమ్మకం నువ్వే జగనన్న అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. నూజివీడు మండల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన వాలంటీర్లు గృహసారతులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వారిని ఉద్దేశించి ఎమ్మెల్యే దిశా నిర్దేశం చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ సచివాలయం కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు.