ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలయ్య, ఎన్టీఆర్‌పై అభిమానం,,,పెళ్లి శుభలేఖపై వారి ఫోటోలు ముద్రణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 23, 2023, 10:50 AM

అభిమాన హీరోలపై అభిమానంతో వారి ఫోటోలను తన పెళ్లి శుభలేఖలపై అచ్చువేయించాడో అభిమాని. నందమూరి బాలకృష్ణకు తెలుగు రాష్ట్రాల్లో మంచి మాస్ ఫాలోయింగ్ ఉంది. అటు సినిమాల్లోనూ.. ఇటు రాజకీయాల్లోనూ బాలయ్యకు అభిమానులు చాలామందే ఉన్నారు. సినిమాలు విడుదలైన సమయంలో తమ అభిమానాన్ని వివిధ రూపాల్లో ప్రత్యేకంగా చాటుకుంటారు. తాజాగా విశాఖకు చెందిన ఓ యువకుడు బాలయ్యపై అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు. తన వివాహ ఆహ్వాన పత్రికలో నందమూరి తారక రామారావుతో పాటూ బాలయ్య ఫోటోలను ఫోటోలను ముద్రించాడు.


విశాఖ జిల్లా పెందుర్తి మండలం చింతలగ్రహారంకు చెందిన పులమరశెట్టి వెంకటరమణ మొదటి నుంచి ఎన్టీఆర్‌కు వీరాభిమాని. ఆయన కుమారుడు కోమలీ పెద్దినాయుడుకి కూడా బాలయ్య అంటే మాటల్లో చెప్పలేనంత అభిమానం. అతడికి మార్చి 11న వివాహం నిశ్చయమైంది. పెళ్లి పిలుపు కోసం ఏకంగా ఆరు పేజీలతో శుభలేఖలు ప్రింట్ చేయించారు. ఆ ఆహ్వాన పత్రికలో బాలయ్య, ఎన్టీఆర్‌పై అభిమానాన్ని చాటుకున్నారు.


శుభలేఖలపై బాలయ్య, ఎన్టీఆర్‌ ఫోటోలను ముద్రించి అభిమానాన్ని ఇలా చాటుకున్నారు. నందమూరి తారక రామారావు గారి దివ్య ఆశీస్సులతో అని ప్రస్తావించారు. ఈ ఆహ్వనపత్రికను బంధువులు, స్నేహితులకు అందజేశారు.. తన అభిమాన నటుడిపై ఉన్న ప్రేమను జీవితంలో ఎంతో కీలకమైన శుభలేఖల్లో కూడా ప్రాధాన్యం ఇచ్చారు. అందుకే అంటుంటారు.. బాలయ్యకు అభిమానులు ఉండరు.. భక్తులే ఉంటారని.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com