దీర్ఘకాలంగా మద్యం తీసుకోవడం, హైపటైటీస్ బీ. సీ వైరస్ కారణాలతో లివర్ పూర్తిగా దెబ్బతింటుంది. అది చేయాల్సిన పనులను ఏదీ చేయదు. దీన్నే సిర్రోసిస్ అంటాం.
ఎలాంటి లక్షణాలు ఉంటాయి..?
పొట్ట కుడి వైపున నొప్పి, వికారం, వాంతులు ఉంటాయి.
కీళ్ల నొప్పులు వేధిస్తాయి.
ఒంటిపై భాగంలో రక్తనాళాలు సాలీడు ఆకృతిలో బయటకు కనిపించడం.
దీర్ఘకాలం పాటు ఆకలి లేకుండా బాగా నీరసంగా, నిస్సత్తువగా ఉంటుంది
పొట్టలో విపరీతంగా గ్యాస్ సమస్య వేధిస్తుంది
కళ్లు పసుపురంగులోకి మారతాయి.
ఈ లక్షణాలు కనిపించినప్పుడు డాక్టర్‌ను సంప్రదిస్తే అల్ట్రాసౌండ్ అబ్డామిన్, లివర్‌ఫంక్షన్ టెస్ట్ వంటివి చేసి, సమస్య ఉందా, లేదా అన్నది నిర్ధరిస్తారు.