వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి సాధ్యమని ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ అన్నారు. ఈ మేరకు జీవీఎంసీ 51 వ వార్డు పరిథి మాధవధార ఈస్ట్ పార్కువద్ద వార్డు కార్పొరేటర్ రెయ్యి వెంకటరమణ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో నియోజక వర్గం సమన్వయ కర్త కెకె. రాజుతో పాటుగా ఎమ్మెల్సీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ పాల్గొన్నారు.
కార్యక్రమంలో బాగంగా పార్క్ కు వచ్చిన వాకర్స్ కు ముక్యమంత్రి వైఎస్ జగన్ అధికారం లోకి వచ్చిన అనంతరం చేపట్టిన అబివృద్ధి పనులను వివరించారు. ముఖ్యంగా విద్య వ్యవస్థలో సంచలనాత్మకమైన మార్పు లను ఆయా విద్యాలయాల్లో చేపట్టిన అబివృద్ధి పనులను వివరించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి విషయంలో ముక్యమంత్రి వైఎస్ జగన్ తీవ్రంగా శ్రమిస్తున్నారని గుర్తు చేసారు.
అంతకముందు ప్రచార కార్యక్రమంలో పాల్గున్న ఆయన వాకర్స్ తో సెటిల్ ఆడుతూ వారిని ఉత్సాహ పరిచారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కట్టమూరి సతీష్, వైసీపీ నాయకురాలు పేడాడ రమణి కుమారి, 50 వ వార్డు కార్పొరేటర్ వావిలా పల్లి ప్రసాద్, సచివాలయం కన్వీనర్లు, గృహ సారథులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.