ఈ నెల 20 న మేఘాలయం నుండి ఐరన్ ఓర్ తో విశాఖ వేదాంత కంపెనీలో సిసిఆర్ యార్డ్ దగ్గర ఒక ట్రైన్ వేగన్ లోడింగ్ నిమిత్తం వచ్చినది. ఆ వేగన్ క్లీన్ చేస్తుండగా ఒక వేగన్ లో ఒక వ్యక్తి పడుకుని ఉన్నట్లు అక్కడ ఉన్న సెక్యూరిటీ సూపర్వైజర్ ఎం. ఎస్ నాయుడు గుర్తించి సంస్థ దృష్టికి తీసుకుని వెళ్ళాడు.
దింతో సంస్థ సి ఐ ఎస్ ఎఫ్ సిబ్బందికి సమాచారం అందజేశారు. వేదాంత సెక్యూరిటీ సి ఐ ఎస్ ఎఫ్ సిబ్బంది అతడిని హర్బరు పోలీస్ స్టేషన్ వారికి అప్పగించారు. హర్బరు పోలీస్ స్టేషన్ సిఐ పి సొభన్ బాబు వ్యక్తిని విచారించి అతని వద్ద ఉన్న ఆధార్ కార్డు పరిశీలించగా అతను పాస్తర్ సంగ్మ , 42 సం”, మేఘాలయ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతని దగ్గర ఉన్న ఫోన్ నెంబర్ ద్వారా అతని కుటుంబ సభ్యులకి సమాచారం అందజేసి తప్పిపోయిన వ్యక్తిని బయట వేరే లాడ్జిలో హార్బర్ హోంగార్డు రమణ ని తోడుగా ఉంచి అతనికి అన్ని వసతులు కల్పించారు. ఇదిలా ఉండగ గురువారం అతని బంధువులకు అప్పగించారు. తప్పిపోయిన వ్యక్తిని కుటుంబం చెంతకు చేర్చిన హార్బర్ పోలీసులు స్టేషన్ అధికారులకు అతడి కుటుంబ సభ్యులు కృతజ్ఞత తెలిపారు.