రాప్ట్రంలో వైసీపీ అరాచక పాలన సాగిస్తుందని మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు అన్నారు. నెల్లూరు జిల్లా, కొండాపురం మండలంలోని నేకునాంపేటలో ఇటీవల వైసీపీ కార్యకర్త దాడిలో గాయపడిన నల్లగట్ల సంతోష్‌ను ఆయన గురువారం పరామర్శించారు. అనంతరం గ్రామంలో ఇదేం ఖర్మ రాష్ర్టానికి కార్యక్రమాన్ని నిర్వహించారు. డ్రైనేజీలు బాగుచేసుకోలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మామిళ్లపల్లి వెంకట రమణయ్య, పుల్లారెడ్డి, పల్లపోతలు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.