గత ప్రభుత్వాల్లో పనిచేసిన ఎమ్మెల్యేలంతా తెచ్చిన నిధుల కంటే, నాలుగేళ్లలో తాను అదనంగా నిధులు తెచ్చి సర్వేపల్లిని ఎంతో అభివృద్ధి చేశానని రాష్ట్ర వ్యవసాయ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి స్పష్టం చేశారు. మనుబోలు మండలంలోని వెంకన్నపాళెంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా రూ. 68లక్షలతో నిర్మించిన సచివాలయం, ఆర్బీకేలను మంత్రి ప్రారంభించారు. అలాగే వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఇంటింటా కరపత్రాలు అందించి సంక్షేమ పథకాల అమలు గురించి తెలుసుకున్నారు.