‘చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్, జగన్రెడ్డి, షర్మిల పాదయాత్రలు చేశారు. ఏనాడూ వారిని అడ్డుకోలేదు. ఇప్పుడు నేను ఒక చిన్న గ్రామంలో మాట్లాడినా ప్యాలెస్ పిల్లి వణికిపోతోంది. నేను మాట్లాడితే ప్రజలు ప్రభుత్వంపై తిరగబడతారనే భయం. నువ్వు ఎంత అడ్డుకుంటే నేను అంత ఎక్కువ మాట్లాడతా..’ అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హెచ్చరించారు. 25వ రోజైన గురువారం యువగళం పాదయాత్ర తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి తిరుపతి నియోజకవర్గంలోకి ప్రవేశించింది. రేణిగుంటలో యాదవ సామాజికవర్గం, ఆర్ఎంపీలతో లోకేశ్ ముఖాముఖి మాట్లాడారు.