చిత్తూరు జిల్లా, కోట పట్టణంలోని ఆకుతోటదిబ్బలో ఓ మహిళ చీటీల పేరుతో మోసం చేసిందంటూ గురువారం 10 మంది సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సభ్యుల కథనం మేరకు స్థానికంగా ఉన్న ఓ మహిళ ఆ వీధిలో నివాసం ఉంటున్న కూలీలచేత రూ. లక్ష, రూ. 50వేలు చొప్పున చీటీలు వేయించుకున్నారు. ఆయా చీటీలకు నెల నెల రూ. 10వేలు, 5వేల రూపాయలను క్రమం తప్పకుండా కట్టించుకున్నారన్నారు. చీటీలు పాడుకున్నవారికి నగదు చెల్లించకుండా వాయిదాలు వేస్తూ తిప్పుకుంటున్నట్లు చెప్పారు. 10 మంది సభ్యులు ఆ మహిళ దగ్గర చీటీలు వేసినప్పటికీ, తమకు రావాల్సిన లక్షలాది రూపాయలు ఇవ్వకుండా ముఖం చాటేస్తున్నారని, చర్యలు తీసుకోవాలంటూ ఆయా సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.