ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కుటుంబ కలహాలలో తండ్రిని చంపిన తనయుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 24, 2023, 12:26 PM

మద్యానికి బానిసైన ఓ తండ్రి కట్టుకున్న భార్య, కొడుకుతో ఘర్షణకి దిగడంతో కోపోద్రిక్తుడైన కొడుకు తండ్రి తలపై గట్టిగా కొట్టడంతో తండ్రి మృతి చెందిన సంఘటన ఉమ్మడి  పశ్చిమ గోదావరి జిల్లా, కుక్కునూరు మండలం వెంకటాపురంలో చోటు చేసుకుంది. పోలీసులు  తెలిపిన వివరాల ప్రకారం వెంకటాపురం గ్రామానికి చెందిన వడ్లకుంట శ్రీను(52) మద్యానికి బానిసై తరచూ కుటుంబ సభ్యులపై ఘర్షణ దిగుతున్నాడు. బుధవారం రాత్రి కూడా మద్యం సేవించి వచ్చి భార్య, కోడలితో గొడవపడ్డాడు. దీంతో కోడలు భయపడి భర్త వెంకటేశ్వర్లుకి ఫోన్‌ చేసింది. భర్త వచ్చి తండ్రిని మందలించే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ ఇంకా గొడవ చేస్తుండటంతో కోపంతో తండ్రి తలపై కర్రతో గట్టిగా కొట్టాడు. దీంతో తలకి బలంగా దెబ్బతగిలి శ్రీను అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ విషయం గురువారం పోలీసులకి తెలపడంతో కుక్కునూరు సీఐ సంఘటన స్థలానికి వచ్చి విచారణ జరిపారు. మృతుని శరీరాన్ని పంచనామ చేయించి, కొడుకు వెంకటేశ్వర్లుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com