దాడి చేసి కొట్టారంటూ భార్య, భర్తలు ఒకరిపై కేసులు పెట్టుకున్నారు. ఇరువురు ఇచ్చిన ఫిర్యాదులపై కేసు నమోదు చేసినట్టు జంగా రెడ్డిగూడెం ఎస్‌ఐ సాగర్‌బాబు తెలిపారు . జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన షేక్‌అహ్మద్ అలీషా షరీఫ్, షేక్ మహ్మద్ అబ్ధుల్ బేగంకు గతేడాది ఏప్రిల్‌లో వివాహమైంది. పట్టణంలోని ఒక ప్రైవేట్ బ్యాంక్‌లో షరీఫ్ ఉద్యోగం చేస్తున్నాడు. అయితే ఇటీవల తూర్పుగోదావరి జిల్లా మామిడి కుదురు బ్రాంచ్‌కు ట్రాన్స్‌ఫర్ అవడంతో భార్య, భర్తలిద్దరూ అక్కడే ఉంటున్నారు. కొంత కాలంగా అధిక కట్నం కోసం భర్త, కుటుంబ సభ్యులు వేధిస్తున్నారని ఈ నెల 17న జంగారెడిగూడెం లోని పుట్టింటికి వచ్చేసింది.ఈనె 21వ తేదీన భర్త షరీఫ్, అతని కుటుంబ సభ్యులు వచ్చి తనపై దాడి చేయడంతో పాటు చాకుతో పొడవగా చేతికి గాయందని భార్య బేగం ఫిర్యాదు చేసిందిు. ఇదే ఘటనపై భర్త షరీఫ్ కూడా స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ప్రతీరోజు బ్యాంక్ నుంచి డబ్బులు ఇంటికి తేవాలని తన భార్య వేధిస్తుండేదని, కొట్టేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు.ఈనెల 18వ తేదీన జంగారెడ్డిగూడెం రాగా భార్య బేగం, కుటుంబ సభ్యులు వచ్చి దాడి చేయడంతో చేయి విరిగిందని భర్త షరీఫ్ ఇచ్చిన ఫిర్యాదుపై ఎస్‌ఐ కేసు నమోదు చేశారు.