రాష్ట్రంలో అరాచకపాలన కొనసాగుతోందని టీడీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ ఆరోపించారు. గురువారం బొప్పడం, అమృత లింగనగరం గ్రామాల్లో ఇదేం ఖర్మ- మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని తెలిపారు. లోకేష్ చేస్తున్న పాదయాత్ర, చంద్రబాబు నిర్వహిస్తున్న సభలకు స్వచ్ఛందంగా వస్తున్న జనాలను చూసి వైసీపీ నాయకుల్లో వణుకుపుడుతోందన్నారు. అందుకే అడుగడునా అవాంతరాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.