మారుతున్న కాలానికి అనుగుణంగా బోధనలో మార్పులు చేయాల్సిన అవసరం ఉం దని అంబేడ్కర్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ నిమ్మ వెంకటరావు తెలిపారు. వర్సిటీలో జరుగుతున్న పేకల్టీ డెవలప్‌మెంటు ప్రోగ్రాంలో రెండో రోజు గురువారం ఆయన మాట్లాడారు. సరైన బోధనా వ్యూహాలను అనుసరించడంతోనే ప్రయోజనం ఉంటుందని చెప్పారు. విద్యార్థుల స్థాయి, కుటుంబ నేపథ్యం, వారి అభిరుచుల మేరకు బోధన సాగాలన్నారు. స్టేట్ రిసోర్స్ సెంటర్ (హైదరాబాద్) మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్.పద్మనాభయ్య మాట్లాడుతూ.. అధ్యాపకులు నిరంతర విద్యార్థులుగా ఉండి కొత్త విషయాలు తెలుసుకోవాలన్నారు. విద్యార్థులను ప్రభావితం చేసేలా బోధన సాగించాలన్నారు. ఎన్‌సీటీఈ (న్యూ ఢిల్లీ) సభ్యుడు ప్రొఫెసర్ గంటా రమేష్ మా ట్లాడుతూ.. బోధన నైపుణ్యాలతోనే విద్యార్థులను ఆకట్టుకోవాలన్నారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సీహెచ్ ఏ రాజేంద్రప్రసాద్, ప్రిన్సిపాళ్లు ప్రొఫెసర్ బిడ్డిక అడ్డయ్య, ఎస్.ఉదయభాస్కర్, సీడీసీ డీన్ ప్రొఫెసర్ పీలా సుజాత పాల్గొన్నారు.