గన్నవరం విధ్వంసకాండపై కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా చెప్పివనన్నీ పచ్చి అబద్ధాలని టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మండిపడ్డారు. సీఐ కనకరావు తల పగలకొట్టడానికే టీడీపీ నేత పట్టాభి విజయవాడ నుంచి గన్నవరం వచ్చాడా? మన పోలీసులు, మన ఆసుపత్రి అయ్యేసరికి వైసీపీ రౌడీలు కొట్టిన దెబ్బలు వైద్యులకు కనిపించలేదా? పట్టాభిని పోలీసులు ఎంత దారుణంగా హింసించారో ఆర్మీ ఆసుపత్రిలో పరీక్ష చేయిస్తే తెలిసేది. పట్టాభిని కొట్టలేదన్న ఎస్పీ మాటలు అబద్ధాలకే పెద్ద అబద్ధం. పట్టాభిని కొట్టకపోతే అన్నం కూడా తినలేని స్థితిలో ఎందుకున్నాడో ఎస్పీ సమాధానం చెప్పాలని వర్ల నిలదీశారు.