హైకోర్టు న్యాయవాదుల సంఘం నూతన అధ్యక్షుడిగా కె.జానకిరామిరెడ్డి గెలుపొందారు. గురువారం నిర్వహించిన ఎన్నికల్లో ఆయనకు 703 ఓట్లు, వి.వేణుగోపాలరావుకు 683, డీఎ్సఎన్వీ ప్రసాద్‌బాబుకు 38 ఓట్లు వచ్చాయి. ఉపాధ్యక్షుడిగా పీఎ్‌సపీ సురేశ్‌కుమార్, ప్రధాన కార్యదర్శిగా వి.సాయికుమార్ గెలుపొందారు. సంయుక్త కార్యదర్శిగా ఎం.సాల్మన్ రాజు, గ్రంథాలయ కార్యదర్శిగా మిత్తిరెడ్డి జ్ఞానేశ్వరరావు, కోశాధికారిగా బీవీ అపర్ణలక్ష్మి, క్రీడలు-సంస్కృతిక కార్యదర్శిగా పితాని చంద్రశేఖర్‌రెడ్డి గెలుపొందారు. మహిళా ప్రతినిధిగా రేవనూరు సుధారాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యనిర్వహణ సభ్యులుగా అన్నం శ్రీధర్, డి.మారుతి విద్యాసాగర్, ఎగ్జిక్యూటివ్ మహిళా సభ్యురాలిగా కాశి అన్నపూర్ణ గెలుపొందారు. ఎన్నికల అధికారిగా సీనియర్ న్యాయవాది ఎం.విజయ్‌కుమార్ వ్యవహరించారు.