ఏపీలోని పల్నాడు జిల్లాలో దారుణం జరిగింది. దాచేపల్లిలో కోటేశ్వరరావు అనే వ్యక్తిని దుండగులు గొడ్డలితో ముక్కలుగా నరికి దారుణంగా హత్యచేశారు. హత్య అనంతరం శరీర భాగాలను తగలబెట్టారు. దాచేపల్లి మోడల్ స్కూల్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణంగా అనుమానిస్తున్నారు.