ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగాల భర్తీలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇప్పటివరకు ఉన్నట్లుగానే ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు(EWS) ఐదేళ్ల వయోపరిమితి పెంచింది. దీంతో గరిష్ఠ వయోపరిమితి 39 ఏళ్లకు పెరిగింది. ఈ మేరకు రాష్ట్ర సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ను సవరిస్తూ సీఎం జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో అగ్రకులాలలోని పేదలకు లబ్ధి చేకూరనుంది.