వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం తేదీ 26 వ తేదీన ఆదివారం ఉదయం10గంటలకు స్థానిక రింగ్ రోడ్ లో గల పెంటకోట కన్వెన్షన్ హాల్ లో రాష్ట్రమంత్రి గుడివాడ అమర్నాధ్ అధ్యక్షతన జరుగుతుందనిఅనకాపల్లి పట్టణ వైసిపిఅధ్యక్షులు మందపాటి జానకీరామరాజు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులు గా టీటీడీఛైర్మన్, ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్చార్జ్ వై వి సుబ్బారెడ్డి , మరియు ప్రభుత్వ విప్
కరణం ధర్మ శ్రీ, అనకాపల్లి పార్లమెంటుసభ్యురాలు భీశెట్టి వెంకట సత్యవతి , వైయస్సార్సీపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు , రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్ కుమార్ లు పాల్గొంటారని పేర్కొన్నారు. కావున వైయస్సార్సీపినాయకులు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారధులు, కార్యకర్తలు అందరూ పాల్గొనవలసిందిగా ఆయన కోరారు