ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు వేయమని ఏయూ వీసి అడుగడుగునా ఎన్నికల కోడ్ ను ఉల్లఘించారని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. విశాఖలోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ఏయూ వీసీపై కలెక్టర్ తో పాటు ఈసీకి ఫిర్యాదు చేశామని చెప్పారు. ఏయూ వీసి ప్రవర్తనపై బిజేపి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. వీసిని రీకాల్ చేయాల్సిన అసవరం ఉందని డిమాండ్ చేశారు.